టాలీవుడ్ లో మొన్నటివరకు సమంత- నాగ చైతన్య ల విడాకుల వార్తలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయి ప్రత్యేకంగా చెప్పకల్సిన అవసరం లేదు. తాము విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత అభిమానులు కొంత సర్దుకున్నారు. ఇక సామ్- చై విడాకుల న్యూస్ అయిన తరుణంలోనే మరో స్టార్ హీరోయిన్ విడాకుల వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రముఖ సీనియర్ నటి ప్రియమణి తన భర్తతో విడిపోతుందని వార్తలు గుప్పుమన్నాయి. 2017లో ప్రియమణి ఈవెంట్ ఆర్గనైజర్ ముస్తఫా రాజ్ ని…
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఇటీవల తన తదుపరి ప్రాజెక్ట్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. నయనతార, ప్రియమణి ఈ సినిమాలో కథానాయికలు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో షారుఖ్ ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూణేలో చిత్రీకరించారు. అక్కడ నుంచి లీకైన ఫోటోలలో షారుఖ్ సరికొత్త మేక్ఓవర్ లో కన్పించారు. లీకైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.…
ఎప్పటినుంచో వినిపిస్తున్న షారూఖ్, అట్లీ సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కింది. ఇటీవల ఈ సినిమా పూణేలో ప్రారంభమైంది. ప్రస్తుతం సినిమా ప్రధాన తారాగణం పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలను అక్కడే చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి ఇద్దరు ప్రముఖ సంగీత దర్శకులు పని చేయబోతున్నారట. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ పాటలు కంపోజ్ చేస్తుండగా, అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేయబోతున్నట్లు టాక్. ఇంతకు ముందు రెహమాన్, అట్లీ కలసి ‘మెర్సల్, బిగిల్’ సినిమాలకు పని చేశారు.…
బాలీవుడ్ స్టార్ షారూఖ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కలయికలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా పూణేలో ప్రారంభమైంది. ఈ సినిమాలో షారూఖ్ సరసన దక్షిణాది తారలు నయనతార, ప్రియమణి నటిస్తున్నారు. ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ గా ‘సంకి’ అనే పేరు పెట్టారు. మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారూఖ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వినిపిస్తోంది. ఈ సినిమాను 2022లో విడుదల చేయనున్నారు. మరో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ ‘భీమ్లా నాయక్’.. ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగులతో బిజీగా వున్నాడు. ఈ సినిమాల నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. త్వరలోనే పవన్ – హరీష్ శంకర్ సినిమా కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే వీరిద్దరూ కాంబోలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఎప్పటి నుంచో ఒక ఇండస్ట్రీ హిట్…
నటి ప్రియమణి 2017లో ముస్తఫారాజ్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడడం తెలిసిందే. అయితే, కొద్దిరోజులుగా ముస్తఫారాజ్ మొదటి భార్య ఆయేషా వారి పెళ్లిపై ఆరోపణలు చేస్తోంది. తాము ఇంకా విడాకులు తీసుకోలేదని, ప్రియమణితో తన భర్త రెండో పెళ్లి చెల్లదని చెబుతోంది. ముస్తఫా, తాను ఇప్పటికీ భార్యాభర్తలమేనని, ప్రియమణితో అతడి పెళ్లి నాటికి తాము విడాకులకు కూడా దరఖాస్తు చేయలేదని స్పష్టం చేసింది. కాగా, ముస్తఫారాజ్, ఆయేషా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే విభేదాల నేపథ్యంలో 2010…
జాతీయ అవార్డు గెలుచుకున్న హీరోయిన్ ప్రియమణి చిక్కుల్లో పడింది, తాజాగా ఆమె పెళ్లి విషయం వివాదంగా మారింది. 2007లో ప్రియమణి, ముస్తఫాల వివాహం జరిగింది. కానీ ప్రియమణితో తన భర్త ముస్తఫా రాజ్ వివాహం చెల్లదని అతని మొదటి భార్య అయేషా ప్రకటించింది. అతను అధికారికంగా విడాకులు తీసుకోలేదని పేర్కొంది. ముస్తాఫా మొదటి భార్య, ఆయేషా ఈ దంపతులపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో ప్రియమణి ముఖ్యాంశాల్లో నిలిచారు. మొదటి భార్యతో సెపరేట్ అయినప్పటికీ ఇంకా విడాకులు…
విక్టరీ వెంకటేశ్ లేటెస్ట్ మూవీ ‘నారప్ప’కు అన్ని వర్గాల నుండి చక్కని ప్రశంసలు దక్కుతున్నాయి. తమిళ ‘అసురన్’తో పోల్చకుండా చూస్తే… నిజంగానే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా గొప్ప అనుభూతిని కలిగించిందని అందరూ అంటున్నారు. మరీ ముఖ్యంగా వెంకటేశ్ నట జీవితంలో ఇదే ప్రత్యేక చిత్రమని అభినందిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాను సినీ ప్రముఖులు సైతం సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు. వీరిందరి అభినందనలూ ఒక ఎత్తు అయితే… వెంకటేశ్ మేనల్లుడు నాగచైతన్య భార్య సమంత…
విక్టరీ వెంకటేశ్, ప్రియమణి కీలక పాత్రలు పోషించిన ‘నారప్ప’ సినిమా అమెజాన్ ప్రైమ్ లో మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. ‘ఈ సినిమాను మే 14న థియేటర్లలోనే విడుదల చేయాలని అనుకున్నామని, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నామ’ని ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన కలైపులి ఎస్. థాను చెప్పారు. 17 సంవత్సరాల క్రితం 2004లో వెంకటేశ్ తో ‘ఘర్షణ’ చిత్రం తెలుగులో తీసిన ఆయన మళ్లీ ఇంతకాలానికి ‘నారప్ప’ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ‘సురేశ్…
విక్టరీ వెంకటేశ్ వెండితెరపై వినోదాన్నే కాదు, పగ ప్రతీకారాలనూ అద్భుతంగా ఆవిష్కరించగలడు. దానికి తాజా ఉదాహరణ ‘నారప్ప’. తన కొడుకును హతమార్చిన ఓ వర్గంపై నారప్ప అనే రైతు ఎలా పగ తీర్చుకున్నాడన్నదే ఈ చిత్ర కథ. అందులో కులం కూడా ఓ ప్రముఖ పాత్ర పోషించింది. వెట్రిమారన్ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘అసురన్’కు ఇది రీమేక్. యంగ్ హీరో ధనుష్ పోషించిన పాత్రను వెంకటేశ్ రక్తి కట్టించగలడా అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేయకపోలేదు. దానికి…