రేపు సాయంత్రం హైదరాబాద్‌లో ప్రధాని మోడీ రోడ్ షోలో పాల్గొననున్నారు. రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి కాచిగూడ చౌరస్తా వరకు సాగనున్న మోడీ రోడ్ షో కొనసాగనుంది. రేపు ఉదయం మహబూబాబాద్ బహిరంగ సభ, మధ్యాహ్నం కరీంనగర్ బహిరంగ సభల్లో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ కూడా తమ అగ్రనేతలను ఆహ్వానిస్తూ ప్రచార హోరును పెంచింది. మంగళవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభకు హాజరైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ నెల 11న రాష్ట్రానికి మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు.
కులతత్వం, ప్రాంతీయత వంటి సామాజిక వక్రీకరణలను రూపుమాపాలని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ద్వారకాలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన దసరా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ, కనీసం ఒక పేద కుటుంబం సామాజిక-ఆర్థిక స్థితిని పెంపొందించడంతో సహా 10 ప్రతిజ్ఞలు తీసుకోవాలని ప్రజలను కోరారు.
Shaktikanta Das: మొరాకోలోని మారాకేష్ నగరంలో శనివారం జరిగిన గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ కార్డ్స్ 2023లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్‌కి 'A+' ర్యాంక్ లభించింది.
అయోధ్యలో మూడంతస్తుల రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం డిసెంబర్ చివరి నాటికి పూర్తవుతుందని, జనవరి 22న పవిత్రోత్సవం జరగనుందని ఆలయ నిర్మాణ కమిటీ చైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. జనవరి 20-24 మధ్య ఏదైనా రోజున 'ప్రాణ ప్రతిష్ఠ'కు సంబంధించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారని భావిస్తున్నామన్నారు.
దేశవ్యాప్తంగా మరో 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలెక్కాయి. ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. సాయంత్రం భేటీ అయిన మంత్రివర్గం.. పలు కీలక అంశాలపై దాదాపు 2 గంటల పాటు చర్చించింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఈ కీలక కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. సమావేశం ఎజెండా ఇంకా వెల్లడి కానప్పటికీ, ప్రత్యేక సమావేశంలో పరిశీలన కోసం జాబితా చేయబడిన కీలక బిల్లులపై చర్చ జరిగే అవకాశం ఉంది.