నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ఇటీవల 8 ఔషధాల ధరలను 50 శాతం పెంచడానికి ఆమోదించింది. ఈ ఎనిమిది నిత్యావసర ఔషధాల ధరల పెంపుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఔషధాల ధరల నిర్ణయంపై పునరాలోచించాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. పౌరుల సంక్షేమమే ప్రధానమని లేఖలో మమత ఉద్ఘాటించారు.