రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటికే ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపు లాంఛనమే అని తెలుస్తున్నా.. ఎంత మెజారిటీతో గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. గురువారం ఉదయం మొదలైన ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం ఎంపీల ఓట్ల లెక్కింపుతో తొలి రౌండ్ ముగిసింది. ఎంపీల ఓట్ల లెక్కింపులో ద్రౌపది ముర్ము భారీగా ఓట్లను సాధించారు. ద్రౌపది ముర్ము 540 మంది ఎంపీల మద్దతులో 3,78,000 విలువను సాధించారు.
BJP Celebrations: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రేపటి నుంచి దేశవ్యాప్తంగా పండగ చేసుకోనుంది. ముఖ్యంగా గిరిజన జనాభా ఎక్కువున్న ప్రాంతాల్లో ఈ ఉత్సవాలను మరింత ఉత్సాహంగా నిర్వహించనుంది.