ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణతో వందల మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభించింది రష్యా. యుద్ధం మొదలై రెండు వారాలు దాటిపోయింది. ఉక్రెయిన్ లో అపార ప్రాణ, అస్తి నష్టం జరుగుతోంది. ఇళ్లు, అపార్ట్‌మెంట్స్, హాస్పిటల్స్ ఇలా మౌలిక వసతులన్ని దెబ్బతిన్నాయి. సిటీలన్నీ శిథిలాలతో నిండిపోయాయి. నివాస ప్రాంతాల్లోనూ రష్యా సైన్యం దాడులు చేస్తుండటంతో ప్రాన నష్టం భారీగానే జరుగుతోంది. చనిపోయిన సాధారణ పౌరుల సంఖ్య వెయ్యి దాటిందని అంచనా…