బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన రాజీనామాను సమర్పించడంతో పాటు బీజేపీతో పొత్తును కూడా రద్దు చేసుకున్నారు. లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) మాజీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ మధ్యంతర ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. గత ఎన్నికల్లో ఆయన కేవలం 43 సీట్లకు తగ్గారని.. వచ్చేసారి సున్నా గెలుస్తారని విమర్శించారు. నితీష్‌కు విశ్వసనీయత సున్నా అంటూ విమర్శలు గుప్పించారు.