తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. గాంధీభవన్‌కు చేరుకునే ముందు గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన గౌడ్ అనంతరం ర్యాలీగా అక్కడికి చేరుకున్నారు. బాధ్యతలు స్వీకరించే ముందు గాంధీభవన్‌లోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్ మున్షీ,…