Gunmen kill 12, including imam, abduct others from mosque in Nigeria: ఆఫ్రికా దేశం నైజీరియాలో ముష్కరులు ఘాతుకానికి పాల్పడ్డారు. మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో ఇమామ్ తో సహా 12 మంది మరణించారు. మరికొంత మంది కిడ్నాప్ చేశారు. ఈ ఘటన నైజీరియా కట్సనా రాష్ట్రంలో జరిగింది. ఇది ప్రెసిడెంట్ మహ్మద్ బుహరీ సొంత రాష్ట్రం.