President Gaari Pellam: ఓ సినిమాతో స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్న హీరోకు సదరు చిత్రం ప్రభావం కొంతకాలం పాటు సాగుతుంది. కొన్నిసార్లు అది ‘ప్లస్’ కావచ్చు, మరికొన్ని సమయాల్లో ‘మైనస్’గానూ మారవచ్చు. ‘దేవదాసు’ సినిమా తరువాత ఏయన్నార్ కు అలాంటి పరిస్థితే వచ్చింది. దాని నుండి బయట పడటానికి అన్నట్టు ఆయన ‘మిస్సమ్మ’లో కామెడీ రోల్ లో కనిపించారు. ‘అల్లూరి సీతారామరాజు’ ఘనవిజయం తరువాత కృష్ణ నటించిన దాదాపు డజన్ సినిమాలు పరాజయం పాలయ్యాయి. మళ్ళీ ఆయన…