President Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు (ఈ నెల 28)న నగరంలో పర్యటించనున్నారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట పరిధిలోని నల్సార్ లా యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవం 28న జరుగుతోంది.
రాష్ట్రపతి ఇవాల ఉదయం షేక్‌పేటలోని జి.నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మహిళా కళాశాల సందర్శించారు. విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశమయ్యారు. నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తోపాటు గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.