ఈ ఏడాది స్టార్ హీరో నాని దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు.ఈ ఏడాది మార్చి 30న థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా 100 కోట్ల కు పైగా వసూళ్లను రాబట్టింది. హీరో నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా దసరా నిలిచింది. దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. ఇంతకు ముందు ఆయన క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసారు.శ్రీకాంత్…