Vadivelu: టాలీవుడ్ కు కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం ఎలాగో.. కోలీవుడ్ కు వడివేలు అలా. స్టార్ కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన వడివేలు ఈ మధ్యనే మామన్నన్ అనే సినిమాలో సీరియస్ పాత్రలో నటించి ఆశ్చర్యపరిచాడు. దళిత ఎమ్మెల్యేగా వడివేలు నటనకు తమిళ్ వారే కాదు తెలుగువారు కూడా ఫిదా అయ్యారు.