ఓ పేషేంట్ నుంచి ఒక్క రూపాయి అధికంగా వసూల్ చేసిన కారణంగా కాంట్రాక్ట్ ఉద్యోగి తన జాబ్ కోల్పోయాడు. స్వయంగా ఎమ్మెల్యే ఆస్పత్రిలో తనికీలు చేయగా.. కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి ప్రభుత్వం తొలగించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహారాజ్‌గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. మహారాజ్‌గంజ్ జిల్లా జగదౌర్ ప్రభుత్వాస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటున్నారంటూ కొన్నిరోజులుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జగదౌర్ గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో సివ్వా ఎమ్మెల్యే, బీజేపీ నేత ప్రేమ్ సాగర్…