ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ విరాట్ కోహ్లీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. 2025లో భారత్ ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ టూర్ విరాట్ కోహ్లికి చివరిదని బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. వచ్చే ఏడాది జూన్ 20 నుంచి జులై 31 మధ్య ఇంగ్లండ్‌తో భారత్ ఐదు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. ఆ సమయంలో కోహ్లీకి 36 ఏళ్లు నిండుతాయి. ఈ క్రమంలో.. 2025 టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ గడ్డపై విరాట్ కోహ్లీ చివరి…