బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఎన్నో ప్రగల్భాలు పలికారు. జేడీయూ 25 సీట్లు కంటే ఎక్కువ గెలవదని.. అసలు అధికార కూటమి ఘోరంగా ఓడిపోబోతుందని.. జేడీయూ 25 సీట్లు కంటే ఎక్కువ గెలిస్తే రాజీనామా చేస్తానని ఎన్నో ప్రెస్‌మీట్‌ల్లో చెప్పుకొచ్చారు.
బీహార్ ప్రజల విశ్వాసాన్ని జన్ సురాజ్ పార్టీ గెలుచుకోలేకపోయిందని ఆ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడారు.