Devaraj: సీనియర్ నటుడు దేవరాజ్ గురించి తెలుగువారికి చెప్పాల్సిన అవసరం లేదు. విలన్ గా ఆయన ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇక ఈ మధ్య సలార్ సినిమాలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సలార్ సినిమాలో రాధారమ మేనమామగా నటించి మెప్పించాడు. ఇక తాజాగా దేవరాజ్ కొడుకు ప్రణం దేవరాజ్ హీరోగా మారాడు.