Devaraj: సలార్ ఫేమ్ దేవరాజ్ కొడుకు హీరోగా కొత్త సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devaraj: సీనియర్ నటుడు దేవరాజ్ గురించి తెలుగువారికి చెప్పాల్సిన అవసరం లేదు. విలన్ గా ఆయన ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇక ఈ మధ్య సలార్ సినిమాలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సలార్ సినిమాలో రాధారమ మేనమామగా నటించి మెప్పించాడు. ఇక తాజాగా దేవరాజ్ కొడుకు ప్రణం దేవరాజ్ హీరోగా మారాడు. ఇప్పటికే రెండు సినిమాలు చేసిన ప్రణం ఇప్పుడు మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శంకర్ దర్శకత్వంలో పి.హరికృష్ణ గౌడ్ నిర్మాణంలో ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రూపొందుతోంది. హరి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1గా తెలుగు, కన్నడ భాషలలో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఈరోజు ఘనంగా ప్రారంభమైయింది. ముహూర్తపు సన్నివేశానికి ఆకాష్ పూరి క్లాప్ కొట్టగా, దేవరాజ్ కెమరాస్విచాన్ చేశారు. తనికెళ్ళ భరణి మేకర్స్ కి స్క్రిప్ట్ అందించి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. స్టార్ కంపోజర్ శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా, బాల సరస్వతి డీవోపీగా పని చేస్తున్నారు. శ్రీ వర్కాల ఎడిటర్ కాగా, గురు మురళీకృష్ణ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.
ఇక ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్ లో దర్శకుడు శంకర్ మాట్లాడుతూ.. “ఇది నా మొదటి సినిమా. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత హరి గౌడ్ గారికి ధన్యవాదాలు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వుండే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. తెలుగు, కన్నడ ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. మొదటి షెడ్యుల్ జనవరి మూడో వారం నుంచి హైదరాబాద్, తర్వాత వైజాగ్ పరిసర ప్రాంతాల్లో నిర్విరామంగా జరుగుతుంది” అన్నారు.
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. సినిమా నిర్మాణం అంటే చాలా ప్యాషన్ వుండాలి. అలాంటి ప్యాషన్ తో నిర్మాత హరి గౌడ్, హరి క్రియేషన్స్ బ్యానర్ ని స్థాపించి నిర్మాణ రంగంలోకి రావడం ఆనందంగా వుంది. దేవరాజు గారు పాన్ ఇండియా నటుడు. ఎన్నో అవార్డులు సాధించారు. ఆయన వారసత్వాన్ని వాళ్ళ అబ్బాయి ప్రణం దేవరాజ్ పుణికిపుచ్చుకుని ఈ రంగంలోకి రావడం చాలా సంతోషంగా వుంది. ఇది తనకి మూడో చిత్రం. ఇప్పటికే కన్నడలో మంచి పేరు తెచ్చుకున్నారు. శంకర్ చాలా ప్రతిభ వున్న దర్శకుడు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించి అందరికీ పేరు ప్రతిష్టలు రావాలి’ అని కోరారు
హీరో ప్రణం దేవరాజ్ మాట్లాడుతూ.. ఇది తెలుగులో నాకు మూడో చిత్రం. చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ వున్న కథ. మంచి లవ్ స్టొరీ, యాక్షన్ వుంది. మీ అందరి ప్రోత్సాహం కావాలి” అని కోరారు. దేవరాజ్ మాట్లాడుతూ.. దర్శకుడు శంకర్ చాలా అద్భుతమైన కథని రాసుకున్నారు. కథ చాలా బావుంది. హరి గౌడ్ మంచి అభిరుచి వున్న నిర్మాత. చాలా మంచి టీం కలసి చేస్తున్న సినిమా ఇది. తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. మీ అందరి ఆశీస్సులు వుండాలి” అని కోరారు. నిర్మాతలు మాట్లాడుతూ.. ఇది మా మొదటి ప్రొడక్షన్. మమ్మల్ని ఆశీర్వదించిన తనికెళ్ళ భరణి గారు, నరసింహారెడ్డి గారు, ఆకాష్ పూరిగారు, దేవరాజ్ గారికి కృతజ్ఞతలు, అందరికి పేరుపేరునా కృతజ్ఞతలు’ తెలిపారు. మరి ఈ సినిమాతో దేవరాజ్ కొడుకు ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!