పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి) అధినేత ప్రకాష్ సింగ్ బాదల్ మంగళవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 95 ఏళ్లు.శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో వారం క్రితం మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు.