సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారులు. అయితే, ఓ వర్గం నిబంధనల్ని తుంగలోకి తొక్కి చేపల్ని వేటాడుతోంది. దీంతో మరో వర్గం ఆకలితో అలమటిస్తోంది. ప్రకాశం జిల్లాలో తమిళనాడు మత్స్యకారుల దోపిడీ హాట్ టాపిక్ అవుతోంది. ప్రకాశం జిల్లా మత్స్యకారులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తమిళనాడు నుంచి వస్తున్న మెకనైజ్డ్ బోట్లు మత్స్య సంపదను దోచుకుపోతుండడంతో ఆకలితో అలమటిస్తున్నారు స్థానిక జాలర్లు. కడుపు కాలి ప్రతిఘటించేందుకు ప్రయత్నిస్తే వలల్ని, బోట్లను ధ్వంసం చేస్తున్నారు. భౌతిక దాడులకు సైతం పాల్పడుతున్నారు…