Bhatti Vikramarka : ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం చిన్నగోపతిలో ప్రజా పాలన గ్రామసభ నిర్వహించారు. ఈ సభకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రజాస్వామ్య దేశం భారతదేశమన్నారు. భారతదేశానికి నేడు అత్యంత పవిత్రమైన రోజు ఈ దేశ రాజ్యాంగాన్ని ఆమోదింపజేసుకున్న రోజు అని, గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నాలుగు సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుందన్నారు భట్టి…