Bhatti Vikramarka : ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం చిన్నగోపతిలో ప్రజా పాలన గ్రామసభ నిర్వహించారు. ఈ సభకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రజాస్వామ్య దేశం భారతదేశమన్నారు. భారతదేశానికి నేడు అత్యంత పవిత్రమైన రోజు ఈ దేశ రాజ్యాంగాన్ని ఆమోదింపజేసుకున్న రోజు అని, గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నాలుగు సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుందన్నారు భట్టి విక్రమార్క. ప్రభుత్వం అమలు జరుపుతున్న ఈ నాలుగు పధకాలకు 45 వేల కోట్ల ఖర్చు అవుతోందన్నారు. కెసిఆర్ పది సంవత్సరాల రాష్ట్రంలోని నిరుపేదలను పట్టించుకోలేదని, కనీసం పదేళ్ల లో రేషన్ కార్డ్ కూడా ఇవ్వలేదన్నారు భట్టి విక్రమార్క. ఎక్స్ పోస్ట్ లు పెడుతున్న నాయకుడికి స్పష్టంగా చెబుతున్నానని, మీరు పదేళ్ల లో ప్రజలకు రేషన్ కార్డులు ఇచ్చి ఉంటే నేడు మేము రేషన్ కార్డులు ఇచ్చే అవసరమే లేదన్నారు. పదేళ్ల మీ పాలనలో గడీలలో కూర్చుని లెక్కలు రాసి దోపిడీ చేశారని, మేము గ్రామ గ్రామాన సభలు నిర్వహించి ప్రజల మధ్యలో ప్రజల ఆమోదం తో పధకాలు కేటాయిస్తున్నామన్నారు భట్టి విక్రమార్క.
Kia Syros : కియా సిరోస్ ఈ 2 వేరియంట్లకు భారీ డిమాండ్.. వాటి ఫీచర్లు ఏంటో తెలుసా ?
అంతేకాకుండా..’బీఆర్ఎస్ నాయకులు మూడు రోజులు గా రాష్టంలో పేట్రేగిపోయారు.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు జరిపే సంక్షేమ పథకాల అమలుపై దుష్ప్రచారం చేసి అల్లరి చూస్తున్నారు. ప్రజలు గమనించండి అటువంటి వ్యక్తులకు బుద్ది చెప్పండి. మీకు ఎవరికీ అన్యాయం జరగదు. ఎటువంటి షరతులు లేకుండా వ్యవసాయానికి అనువుగా ఉన్న ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా ఇస్తున్నాము. ఎటువంటి షరతులు, నిబంధనలు లేవు వ్యవసాయం చేసే రైతులు అందరికీ పధకం వర్తింపు జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు మోసపూరిత వాగ్దానాలు చేయదు. పదేళ్లు పాలన చేసి ఒక్క లక్ష రూపాయల రుణమాఫీ చేయలేకపోయారు. రాష్ట్ర వ్యాప్తం గా మహిళలు ఉచిత బస్సులో ప్రయాణిస్తున్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా పది లక్షల వరకూ బిల్లులు చెల్లిస్తున్నాము. 200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంట్రిగ్రేటెడ్ స్టూల్స్ నిర్మిస్తున్నాము. మహిళల కు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వబోతున్నాము. ప్రజలు గమనించండి పదేళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకున్న బిఆర్ ఎస్ నాయకులు కుట్రలు కుతంత్రాల కు పాల్పడుతున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ ఆగదు’ అని భట్టి విక్రమార్క అన్నారు.
Reliance: బడ్జెట్‌కు ముందే రిలయన్స్‌కు భారీ షాక్.. 5 రోజుల్లో రూ.75 వేల కోట్ల నష్టం