సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నన్ను ముఖ్యమంత్రి చేసి నా గౌరవాన్ని పెంచింది గజ్వేల్ గడ్డ అని తెలిపారు. గజ్వేల్ కి రైలు వస్తుందని అనుకోలేదు కానీ రైలు వచ్చింది.. గజ్వేల్ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని అన్నారు. ఇతర దేశాల ప్రతినిధులు గజ్వేల్ కి వచ్చి మన అభివృద్దిని చూసి వెళ్తున్నారని తెలిపారు. అయ్యింది చాలా గొప్ప అంటే సరిపోదు..ఇంకా చాలా చేయాలన్నారు.…
CM KCR: ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ముందుగా సిరిసిల్ల బీఆర్ ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో, ఆ తర్వాత సిద్దిపేట సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బీఆర్‌ఎస్ పార్టీతో చేరారు. జనగామ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల మైదానంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభా వేదికగా ఆయన గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.