తెలంగాణ రాష్ట్రంలోని పోడు భూముల సమస్య పరిష్కారం పై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కాసేపటి క్రితమే ప్రగతి భవన్ లో ప్రారంభమైన ఈ సమీక్షా సమావేశంలో అడవుల పరి రక్షణ, హరిత హారంపై చర్చిస్తున్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందించనున్నారు. అడవులు అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై, హరిత హారం ద్వారా విస్తృత ఫలితాల కోసం ప్రణాళికలపై చర్చించనున్నారు. పోడు సమస్యపై అటవీ, గిరిజన సంక్షేమ శాఖల…
ఇవాళ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించనున్నారు. పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులు, పోలీస్ శాఖను ఆధునీకరించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, గుడుంబా నిర్మూలన, పేకాట క్లబ్బుల నిషేధం వంటి వాటిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల మాఫియా పెచ్చుమీరుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మాదకద్రవ్యాల విక్రయాలు నిరోధించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్..…
విజయ దశమి సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వమించారు.. ప్రగతి భవన్‌లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు సీఎం కేసీఆర్…సంప్రదాయ బద్దంగా వాహన పూజ, అయధ పూజ ఘనంగా నిర్వహించారు. దసరా సందర్భంగా జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజ నిర్వహించిన ఆయన.. కుటుంబ సభ్యులు, సిబ్బందిని ఆశీర్వదించారు. ప్రగతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్-శైలిమ దంపతులు, హిమాన్షు,…
జ్యోతిరాదిత్య సిందియా ప్రగతి భవన్ కు వెళ్లడంతో తెలంగాణ బిజెపి నేతలు ఇరకాటంలో పడ్డారా ఇప్పటికే కేసీఆర్ డిల్లీ టూర్ ఓ పక్క, హుజూరా బాద్ ఎన్నికల షెడ్యూల్ రాక పోవడం మరోపక్క తెలంగాణ బిజెపి నేతల్ని ఇబ్బందుల్లో పడేశాయి. ఇప్పుడు కేంద్రమంత్రులు కూడా ప్రగతిభవన్ కి వెళ్లి కెసీఆర్ ని కలుస్తున్నారు.. తెలంగాణలో టియ్యారెస్ కు తామే ప్రత్యామ్నాయం అంటున్న బీజేపీ రాష్ట్ర నేతలు ఈ పరిణామాలతో టెన్షన్ పడుతున్నారట. ఓ వైపు తెలంగాణ బీజేపీ…
దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభం అయ్యాయి.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలంటూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి.. ఇక, వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్రగతి భవన్ అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు శోభ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ – శైలిమ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్, మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య… తదితరులు పాల్గొన్నారు.…
మంత్రి ఎర్రబెల్లితో వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశానని అన్నారు ఎల్ రమణ. సామాజిక తెలంగాణ కోసం కృషిచేయాలని కేసీఆర్‌కు చెప్పాన్నారు. తనతో కలిసి రావాలని సీఎం కేసీఆర్ కోరారన్నారు ఎల్ రమణ. టీఆర్‌ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారని చెప్పారు. తన నుంచి సానుకూల నిర్ణయం ఉంటుందని సీఎం కేసీఆర్‌కు తెలిపారని అన్నారు ఎల్ రమణ. కాగా, ఇప్పటికే ఎర్రబెల్లితోనూ సుదీర్ఘ మంతనాలు జరిపారు ఎల్. రమణ.. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. రాష్ట్రంలో టీడీపీకి మనుగడ కష్టమని…
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగలడం ఖాయం అయిపోయింది. గతంలోనే టి.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ.. టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారంటూ జోరుగా ప్రచారం సాగినా.. ఆయన ఆ వార్తలను ఖండించారు.. అయితే, తాజా పరిణామాలు చూస్తుంటే మాత్రం.. రమణ.. కారు ఎక్కడమే మిగిలిందంటున్నారు.. ఆ వాదనలకు బలాన్ని చేకూరుస్తూ.. ఇవాళ ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం అయ్యారు ఎల్ రమణ.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ప్రగతిభవన్‌కు వచ్చిన ఆయన.. కేసీఆర్‌తో చర్చలు జరిపారు.. ఇక,…
రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ నిన్న పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు అండగా ఉండాలని చెప్పిన సీఎం కేసీఆర్… రైతు బీమా తరహాలోనే చేనేత బీమా పథకం తీసువస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకు రూ. 5 లక్షల బీమా వర్తింప జేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. read also : ఏపీ మంత్రులపై జేసీ సంచలన వ్యాఖ్యలు.. అయితే.. చేనేత…
సీఎం కేసీఆర్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశాన్ని బీజేపీ బహిష్కరించినా.. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాత్రం హాజరుకావడం ఆస్తికరంగా మారింది.. అంతే కాదు.. సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించిన మోత్కుపల్లి.. ఆయనకు అభినందనలు తెలిపారు.. మరియమ్మ లాకప్ డెత్ విషయంలో మీరు తీసుకున్న రక్షణ చర్యలు దళిత వర్గాల్లో చర్చనీయాంశమైంది.. దళితుల్లో మీ మీద విశ్వాసం పెరిగిందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు మోత్కుపల్లి.. ప్రజల హృదయాల్లో శాశ్వతంగా…
సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ పథకానికి సంబంధించి ప్రగతిభవన్ అఖిలపక్ష సమావేశం జరుగుతోంది.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు.. అయితే, ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాట్టు బీజేపీ ప్రకటించినా.. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హాజరు కావడం పెద్ద చర్చగా మారింది.. దీనిపై బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి స్పందించారు.. బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీ నిర్ణయంపై మోత్కుపలి కి…