పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ నటనపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడు నటుడు అర్షద్ వార్సి తాజాగా ‘కల్కి 2898 AD’పై చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి.