నేడు కనుమ పండుగ సందర్భంగా అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ప్రభల ఉత్సవం నిర్వహించనున్నారు. అంబాజీపేట మండలంలో ఏకాదశ రుద్రులు కొలువైన పదకొండు గ్రామాలలో ప్రభల ఊరేగింపులు కొనసాగనున్నాయి.. ఈ నేపథ్యంలో పి. గన్నవరం సీఐ భీమరాజు ఆద్వర్యంలో ప్రభల తీర్ధాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.