పాకిస్థాన్‌ను ప్రస్తుతం అన్ని వైపుల నుంచి సమస్యలు చుట్టుముట్టాయి. ఒక వైపు బలూచిస్థాన్‌లో అస్థిరత నెలకొంది. మరోవైపు సింధ్ ప్రావిన్స్ లో నిరసనలు తారా స్థాయికి చేరుకున్నాయి. పహల్గాం ఘటన తర్వాత సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. నీళ్లు లేకపోవడంతో పాక్ ప్రజలు ఎదురు తిరిగారు. తాజాగా పాక్ హోంమంత్రి జియా ఉల్ హసన్ ఇంటిని తగలబెట్టారు.