ఏపీలో ఒకవైపు విద్యుత్ కోతలు.. మండుతున్న ఎండలతో జనం ఇబ్బందులు పడుతున్న వేళ మరో పిడుగు పడింది. విశాఖపట్టణం సమీపంలోని ఎన్టీపీసీ సింహాద్రిలోని 4 యూనిట్లలో ఒకేసారి విద్యుదుత్పత్తి నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది. మంగళవారం ఉదయం 3 గంటల నుంచి 2 వేల మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో ఎన్టీపీసీ పరిసరాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు విద్యుదుత్పత్తిని పునరుద్ధరించే చర్యలు చేపట్టారు. ఒకేసారి నాలుగు యూనిట్లలో విద్యుదుత్పత్తి నిలిచిపోవడం ఇదే ప్రథమం అని…