దేశంలో 12 రాష్ట్రాలు తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయి. పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, బీహార్, యూపీ, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో పరిశ్రమలకు వారంలో 2-3 రోజులు పవర్ హాలిడే ప్రకటించడంతో పాటు ఇళ్లకు గంటల తరబడి కోతలు విధిస్తున్నారు. వేసవి కారణంగా ఏపీలో డిమాండ్ పెరిగిపోవడంతో ఒక్కసారిగా విద్యుత్ కొరత నెలకొంది. దీంతో విద్యుత్ వినియోగంపై విద్యుత్ సంస్థలు ఆంక్షలు విధించాయి. ఇప్పటికే పరిశ్రమలపై విద్యుత్ సంస్థలు ఆంక్షలు విధించగా..…