ఏలూరు జిల్లాలోని ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం పోరస్ కెమికల్ కంపెనీలో బుధవారం అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో సంఘటన స్థలాన్ని ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోరస్ మృతులకు ప్రభుత్వం వైపు నుంచి రూ. 25 లక్షలు.. కంపెనీ వైపు నుంచి రూ. 25 లక్షలు నష్టపరిహరం అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తీవ్ర క్షతగాత్రులకు…