రెండున్నరేళ్ళ తర్వాత కేబినెట్ మారుస్తానని చెప్సిన జగన్ గ్రేస్ పీరియడ్ పెంచి మరో ఆరునెలల తర్వాత కేబినెట్ మార్చారు. అందులోనూ సగం మందిని వుంచేశారు. ఏపీలో కేబినెట్ కూర్పు పూర్తైంది.. శాఖల కేటాయింపు కంప్లీట్ అయింది. చాలా మంది మంత్రులు తమకు అప్పగించిన శాఖలకు సంబంధించి బాధ్యతలు చేపట్టారు. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొన్ని శాఖల్లో మార్పులు చేర్పులు జరుగుతాయనే చర్చ జోరుగా సాగుతోంది. తమకు అప్పగించిన శాఖలు నచ్చక..…