ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడిన 40 రోజుల తర్వాత మంత్రివర్గ విస్తరణ, మంత్రుల ప్రమాణ స్వీకారం ప్రక్రియ మంగళవారం పూర్తయిన విషయం తెలిసిందే. తమకు కీలక శాఖల బాద్యతలు అప్పగిస్తారా లేక అంతగా ప్రాధాన్యత లేని శాఖలు లభిస్తాయా అనే దానిపై మంత్రుల్లో నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడింది. మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నిర్ణయం తీసుకున్నారు.