Child Abuse Case: హైదరాబాద్‌లోని షాపూర్‌నగర్‌లో నాలుగేళ్ల చిన్నారిపై ఓ ప్రైవేట్ పాఠశాల ఆయా అమానుషంగా వ్యవహరించిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. పూర్ణిమ స్కూల్‌లో జరిగిన ఈ దారుణంపై విద్యాశాఖ వెంటనే చర్యలు తీసుకొని స్కూల్‌ను సీజ్ చేసింది. బాధిత చిన్నారి ప్రస్తుతం కోలుకుంటోంది. అభం శుభం తెలియని చిన్న పాపపై ఈ అమానుష హింస అందరిని కలచివేసింది. పాప తండ్రితో జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న ఆయా లక్ష్మి, చిన్నారిని స్కూల్ ప్రాంగణానికి…