Kerala: మటన్ తక్కువగా వడ్డీస్తున్నారని చెబుతూ ఏకంగా ఓ ఖైదీ జైలు అధికారులపైనే దాడి చేశాడు. ఈ ఘటన కేరళలో జరిగింది. తనకు వడ్డించిన మటన్ కర్రీతో సంతృప్తి చెందకపోవడంతో వయనాడ్ కు చెందిన ఖైదీ ఫైజాస్ పూజపురా సెంట్రల్ జైలులో అధికారులపై దాడికి పాల్పడ్డాడు. డ్రగ్స్ కేసులో దోషిగా తేలిన ఇతడిని ప్రస్తుతం జైలులో అత్యంత భద్రతతో కూడిన సెల్ లో ఉంచారు.