కష్టాల కడలిలో ఉన్న తారలను ఆదుకోవడంలో మెగాస్టార్ చిరంజీవి ముందువరసలో ఉంటూ వస్తున్నారు. పలు తెలుగు సినిమాలలో ప్రత్యేకించి చిరంజీవి సినిమాలు ‘ఘరానా మొగుడు, ముగ్గురు మొనగాళ్లు’ తదితర చిత్రాల్లో విలన్ గా, ఫైటర్ గా నటించిన పొన్నాంబళం కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఇది తెలిసి చిరంజీవి వెంటనే స్పందించారు. ఆయన కిడ్నీ మార్పిడి కోసం రెండు లక్షలను పొన్నాంబళం బ్యాంకు అకౌంటుకు బదిలీ చేశారు. పొన్నాంబళం చెన్నైలో ఉంటూ కిడ్నీ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. చిరంజీవి…