Hyderabad: ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌లో పాస్ పోర్ట్ సేవా కేంద్రం ప్రారంభమైంది.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సేవలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే మొట్టమొదటి సారిగా మెట్రో స్టేషన్‌లో పాస్ పోర్ట్ సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.. పాస్ పోర్ట్ ఇవ్వడంలో దేశంలోనే హైదరాబాద్ ఐదవ స్థానంలో ఉందన్నారు.. తెలంగాణలో ఇప్పటి వరకు ఐదు పాస్ పోర్ట్ సేవ కేంద్రాలు ఉన్నాయని వివరించారు.. తెలంగాణాలో రోజుకు 4500 పాస్ పోర్టులు ఇచ్చే సౌకర్యం ఉంది..
Ganesh Chaturthi 2025: MCRHRD లో గణేష్ ఉత్సవాలు 2025 పై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, డీజీపీ జితేందర్.. జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్,హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో పాటు హైదరాబాద్ ,మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు ఇంకా ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. INDIA Bloc: ప్రతిపక్ష ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తుషార్!…
Ponnam Prabhakar : వర్షాల కారణంగా రింగ్ రోడ్డులోపల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని లక్ష్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్‌ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాత్కాలిక ట్రాఫిక్ ఇబ్బందులు తప్ప ఇతర పెద్ద సమస్యలు లేవని తెలిపారు. ఏ విభాగమైనా సరే సమన్వయంతో పనిచేస్తే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని చెప్పారు. ప్రభుత్వం ఎంతటి చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం కూడా అవసరమని మంత్రి స్పష్టం చేశారు. ఆకస్మిక…
హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర ముఖ్య నేతలతో కలిసి జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోనీ రోడ్ నంబర్ 5 ,ఇందిరా నగర్ లోని భద్రాచలం కేఫ్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరవాసులకు శుభవార్తను అందించారు. ఆగస్టు ఒకటి నుంచి హైదరాబాద్ లో రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. 50 వేల రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. 2 లక్ష 50 వేల మంది పేర్లు రేషన్ కార్డులో చేర్చాము అని తెలిపారు.…
Ponnam Prabhakar : తెలంగాణలో బిసి రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో మార్చి నెలలో ఆమోదించి గవర్నర్‌కు పంపినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మార్చి 22, 2025న బిల్లును గవర్నర్‌కు పంపించగా, గవర్నర్ మార్చి 30న బిల్ నంబర్ 3, బిల్ నంబర్ 4లను రాష్ట్రపతికి పంపినట్లు ఆయన వెల్లడించారు. జూలై 14న ఆర్డినెన్స్ ముసాయిదాను కూడా గవర్నర్‌కు పంపామని, గవర్నర్ నుండి సానుకూల నిర్ణయం వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీలకు పంచాయతీ యాక్ట్ ప్రకారం…
Ponnam Prabhakar : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన ఒక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఎరువుల కొరతపై బీజేపీ చేస్తున్న విమర్శలు నిరాధారమని, “ఎరువులు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయనే విషయం కూడా రామచంద్రరావుకి తెలియదా?” అంటూ మండిపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలు, ఎరువులు ఎక్కడి నుండి వస్తాయో కూడా రామచంద్రరావుకి అర్థం కావడం లేదు. మిగతా విత్తనాలు,…
మిస్టరీగానే గండికోట మైనర్ బాలిక హత్య కేసు.. ఎస్పీ ఏం చెప్పారంటే..? కడప జిల్లాలోని గండికోటలో మైనర్ బాలిక వైష్ణవి హత్య కేసు మిస్టరీగా ఉంది. ఈ సందర్భంగా రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ.. గండికోట మైనర్ బాలిక కేసు కాస్త సమయం పడుతుంది అన్నారు. సెల్ టవర్ ఆధారంగా 350 మంది అనుమానితుల ముబైల్ సిగ్నల్స్ గుర్తించాం.. అదే రోజు పక్కనే ఉన్న గ్రామంలో ఒక జాతర జరిగింది.. రెండు సెల్ టవర్ల…
Ponnam Prabhakar : కరీంనగర్ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీపై ఘాటుగా విరుచుకుపడ్డారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుండే పార్టీ అని పేర్కొన్నారు. దళితులు, బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. బలహీన వర్గాలకి ముఖ్యమంత్రి ఇస్తామని బీజేపీ ప్రకటించినా, శాసనసభ నాయకత్వం ఇవ్వలేకపోయిందని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి అకారణంగా తొలగించడం…
Minister Ponnam: ఢిల్లీలో అఖిల భారత నాయకత్వంతో కీలక సమావేశాలు జరిగాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నిన్న ఖర్గే నివాసంలో తెలంగాణలో కులగణన, బీసీ రిజర్వేషన్లపై చర్చ జరిగింది.. భారత్ జోడో యాత్రలో అసమానతలు గమనించి కులగణన చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
Minister Ponnam Prabhakar’s statement on TSRTC: గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను నిర్వీర్యం చేశారని, ఓ సమయంలో ఆర్టీసీ ఉంటుందా? అని కూడా అనుకునే పరిస్థితి ఉండేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ నష్టాల నుంచి లాభాల్లోకి వస్తుందని తెలిపారు. గత 10 సంవత్సరాల్లో ఆర్టీసీ ఉద్యోగుల పైసలు వాడుకున్న పరిస్థితి ఉండేదని, ఇప్పుడు వారికి డబ్బులు చెల్లిస్తున్నాం అని చెప్పారు. ఆర్టీసీలో ఉచిత…