కంటోన్మెంట్ లో ఎలా గెలిపించారో.. జూబ్లీహిల్స్ లోనూ గెలిపించాలని కార్యకర్తలకు దిశానిర్థేశం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. జూబ్లీహిల్స్ అభివృద్ధి ముఖ్యమంత్రి తీసుకున్నారని.. కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని ఆయన సూచించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనీ ఎర్రగడ్డ డివిజన్ లో హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎర్రగడ్డ డివిజన్ లోని 2.16 కోట్ల రూపాయల వ్యయంతో నటరాజ్ నగర్, శంకర్‌లాల్ నగర్, ఛత్రపతి శివాజీ నగర్…
హైదరాబాద్ అభివృద్ధి కోసం రక్షణ శాఖ భూముల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వ తరపున ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ కు లేఖ రాశారు.
Ponnam Prabhakar: హన్మాకొండ జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ విజయదశమి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి శమీ పూజ చేసి ఆయుధాలను పూజించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన కొన్ని ప్రసంగించారు. ముందుగా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని, ఈ పండుగ రోజున అందరికీ మంచి విజయాలు కలగాలని ఆయన…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన కసరత్తును కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌తో పాటు జూబ్లీహిల్స్ ఎన్నిక షెడ్యూల్ కూడా వస్తుంది కాబట్టి.. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి ఎంపికపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థులతో పాటు జూబ్లీహిల్స్ అభ్యర్థిపై చర్చ జరిగింది. ఈ…
తెలంగాణ రాష్ట్రంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త బస్ డిపోలు నిర్మాణం, పాత బస్ స్టేషన్ల పునరుద్ధరణ, ఆధునీకరణ పనుల కోసం ప్రభుత్వం రూ.108.02 కోట్ల నిధులు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు జారీ చేసింది.
బలహీన వర్గాల రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనకడుగు వేయదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు.
Ponnam Prabhakar: తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ వస్తు, సేవల పన్ను(GST) విషయంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. GSTని ప్రవేశపెట్టినప్పుడే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దానిని “గబ్బర్ సింగ్ ట్యాక్స్”గా అభివర్ణించారని, ఇది దేశ ప్రజలకు దోచుకునే ఆయుధంగా మారిందని ప్రభాకర్ అన్నారు. పెట్రోల్, డీజిల్ వంటి వాటిని GST పరిధిలోకి తీసుకురావాలని రాహుల్ గాంధీ సూచించినా.. మోదీ ప్రభుత్వం దానిపై స్పందించలేదని ఆయన పేర్కొన్నారు. Most Wanted…
హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రైవేట్ హాస్పిటల్స్ను ఉద్దేశించి కీలక ప్రకటన చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయడం పేద ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.