Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీ వాతావరణం రోజురోజుకూ విషమంగా మారుతోంది. గురువారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) ప్రమాదకర స్థాయికి చేరుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో డీజిల్‌తో నడిచే వాణిజ్య వాహనాలు, ట్రక్కులు నిషేధించబడ్డాయి. నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450కి పడపోవడంతో వాహనాలను నిషేధించారు.
దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణా, యూపీ రైతులు పంట వ్యర్థాలను కాల్చేస్తుండటంతో ఆ పొగంతా ఢిల్లీని దట్టంగా కమ్మేస్తోంది. దీంతో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది.