Kerala: కేరళలో దారుణం జరిగింది. 16 ఏళ్ల మైనర్ బాలుడిపై పదే పదే లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో కేరళ పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఒక రాజకీయ నాయకుడు, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఒక ఫుట్ బాల్ కోచ్ ఉన్నారు. నిందితులు గే డేటింగ్ యాప్‌లో సదరు బాలుడితో స్నేహం చేసినట్లు తెలుస్తోంది.