ChandraBabu: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆయన డిసెంబర్ 5న ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే దేశంలోని రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి చంద్రబాబు హాజరు కానున్నారు. డిసెంబర్ 1,2022 నుంచి నవంబర్ 30,2023 వరకు జీ20 దేశాల కూటమి సమావేశాలకు భారత్ అధ్యక్షత వహించనుంది. భారత్‌లో నిర్వహించే జీ20 భాగస్వామ్య దేశాల సమావేశాలపై రాజకీయ పార్టీల అధ్యక్షులతో ప్రధాని మోదీ చర్చించనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో డిసెంబర్…