MLA Defection Case: తెలంగాణలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసిన ఎమ్మెల్యేల పిరాయింపు కేసు నేడు సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. ఢిల్లీలోని సుప్రీం కోర్టులో జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌ల ధర్మాసనం ఈ వ్యవహారంపై విచారణ చేపట్టనుంది. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీర్పు వెలువరించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పష్టం చేస్తూ అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. అయితే ఈ నిర్ణయంపై అభ్యంతరాలు…