జనసేన నుంచి తాజాగా ఓ లేఖ విడుదలైంది. పార్టీ లైన్ దాటవద్దు అనే టైటిల్‌లో లేఖను సోషల్ మీడియాలో విడుదల చేసింది పార్టీ. కొందరు నేతలు పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, పార్టీ లైన్ తప్పుతున్నారని లేఖలో పేర్కొన్నారు.
వైసీపీ ఎప్పుడూ ప్రజలపై బాధ్యతాయుతంగా వ్యవహరించిందని.. జగన్ ప్రజలే అన్నీ అని నమ్మారని వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజాగ్రహాన్ని ఇప్పటికైనా గమనించండన్నారు. తాజాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అడ్డగోలుగా వెళ్తే ప్రజలు సమాధానం చెబుతారని.. ప్రజల అభీష్టం మేరకే పార్టీలకు మనుగడ సాగించగలవని చెప్పారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డికి నియోజకవర్గ ఓటర్ ఫోన్ చేశాడు. దీనికి సంబంధించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేసవిలో తాగు నీటి సమస్య తీవ్రంగా ఉందని.. తీర్చాలని ఎమ్మెల్యేని ఓటర్ కోరాడు. త్వరలోనే తాగు నీటి కోసం నియోజకవర్గానికి రూ. 2 కోట్లు వస్తాయని ఎమ్మెల్యే చెప్పారు. ఎప్పుడు వస్తాయని అడిగితే గ్యారెంటీ లేదని సమాధానమిచ్చారు ఎమ్మెల్యే సంజీవ…
నోటీసులకు నోటీసులతోనే సమాధానం చెప్తా అని ఆయన బండి సంజయ్ వెల్లడించారు. కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపిస్తా అని, కేటీఆర్ నీ అయ్య, నీ కుటుంబ సభ్యులు వచ్చి డ్రగ్స్ పై సంబంధం లేదని గుండె మీద చేయి వేసుకొని ప్రమాణం చేయమని చెప్పు అని ఆయన అన్నారు.
ఇవాళ ఆయన ఎన్టీవీతో ముఖాముఖి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిననాడే చావు తెగించి వచ్చామని, ఉద్యమ సమయంలో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద నాయకులతో కొట్లాడినమని ఆయన అన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్న చిట్టినాయుడి అని, ఆ చిట్టినాయుడు ఏదో కేసు పెడుతా.. అది చేస్తా.. ఇది చేస్తా అంటే భయపడేది లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.