పోలీసులకు భయపడి ఓ వ్యక్తి పారిపోతూ బావిలో పడి మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… జమ్మికుంటకు చెందిన పొనుగంటి వేణు అనే యువకుడు ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఆదివారం సెలవు దినం కావడంతో సరాదాగా స్నేహితులతో గడపాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు వేణు తన స్నేహితులతో కలిసి హుజురాబాద్ రోడ్డులోని ఓ బారు సమీపంలో ఆదివారం రాత్రి సమయంలో మద్యం సేవిస్తున్నాడు. అయితే…