బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో నిందితుడిని పోలీసులు గుర్తించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన షార్ట్ ఫిలిం దర్శకుడుగా గుర్తించారు. ప్రమాదం తరువాత.. కారును వదిలిపెట్టి నిందితుడు పారిపోయాడు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఘటన జరిగింది.. స్నేహితులతో మద్యం సేవించి ఉండటం కారణంగా ఈ ఘటన జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.