Police fighting: సాధారణంగా రోడ్డుపై సామాన్యులు కొట్లాటకు దిగితే పోలీసులు అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుంటారు. కానీ అదే పోలీసులు కొట్టుకుంటే వారిని ఆపడం ఎవరి తరం కాదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఉత్తరప్రదేశ్ జలౌన్‌లో తాజాగా ఇద్దరు పోలీసులు కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే సదరు పోలీసులు ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారని తెలుస్తోంది. మద్యం మత్తులో ఉన్న హోంగార్డు, కానిస్టేబుల్‌కు మధ్య ఘర్షణ తలెత్తగా…