AP Police Department: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి పోలీసు శాఖలో భారీ ప్రక్షాళన జరగబోతోంది.. మూడేళ్లకు మించి ఒకే చోట పని చేసినవారికి స్థాన చలనం తప్పదు.. ఈ మేరకు యూనిట్ ఆఫీసర్లకు మెమో జారీ చేశారు ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి.. అయితే, చాలా చోట్ల కొందరు పోలీసులు ఐదేళ్లకు మించి ఒకే చోట పని చేస్తున్నట్టు డీజీపీ కార్యాలయం గుర్తించింది… దీంతో, మూడేళ్లకు మించి ఒకే చోట పని చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది..…
telangana cabinet green signal to recruitment in police department. Breaking News, Latest News, Police Department, Telangana Cabinet, Big News, telugu News,
ఏపీలో 52 మంది అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ అడిషనల్ డీసీపీగా సి.జయరామరాజు, అనంతపురం అడిషనల్ ఎస్పీగా ఇ.నాగేంద్రుడు, తూర్పుగోదావరి అడిషనల్ క్రైమ్ ఎస్పీగా జి.వెంకటేశ్వరరావు, ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీగా బి.నాగభూషణ్‌రావు, మెరైన్ అడిషనల్ ఎస్పీగా జీబీఆర్ మధుసూదన్‌రావు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడిషనల్ ఎస్పీగా జి.స్వరూపరాణి, అడ్మిన్ అడిషనల్ ఎస్పీగా వెంకట రామాంజనేయులు, విజిలెన్స్ అండ్…
వికారాబాద్ జిల్లా తాండూరు సీఐ రాజేందర్ రెడ్డిని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ బండ బూతులు తిట్టిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి స్పందిస్తూ.. పొరపాటున నోరుజారిన ఆడియో క్లిప్ లతో మనసులు నొప్పించినందుకు విచారిస్తున్నానని ఆయన అన్నారు. నిన్నటి సంఘటనతో ఉన్న ఆడియో క్లిప్పులతో పోలీసుల మనస్సు నొప్పిస్తే అది తనకు బాధకరంగా ఉంటుందని మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఓ ప్రకటనలో పోలీసు సోదరులంతా…
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెబుతూ ఇక, వరుసగా నోటిఫికేషన్లు ఉంటాయంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు.. అయితే, కొంత గ్యాప్ వచ్చినా.. న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది సర్కార్.. ఇప్పటికే హోంశాఖ సహా.. ఇతర కొన్ని విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే కాగా.. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోన్న అభ్యర్థులకు తీపికబురు చెబుతూ.. పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది సర్కార్.. కానిస్టేబుళ్లు,…
పెగాసస్ వ్యవహారం భారతీయ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసింది.. పార్లమెంట్ ఉభయసభలను స్థంభించిపోయాయి.. అయితే, పెగాసస్ స్పైవేర్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో సంస్థ నాలుగైదేళ్ల క్రితం పెగాసస్ స్పైవేర్‌ను తమకు అమ్మేందుకు బెంగాల్ వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఆమోదం కానందున ఆ సంస్థ ఆఫర్‌ను తాము తిరస్కరించామని చెప్పారు దీదీ. నాలుగైదు ఏళ్ల క్రితం ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. పెగాసస్ స్పైవేర్…
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 80వేల ఉద్యోగ నియామకాలకు సంబంధించి తొలి నోటిఫికేషన్ పోలీస్ శాఖ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు తెలంగాణ పోలీసు శాఖలో 18,334 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ప్రభుత్వం ఈ వారంలో గ్రీన్‌సిగ్నల్ ఇస్తే.. ఆ తర్వాత ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పోలీస్ శాఖ నుంచి ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలో తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్, సివిల్, ఆర్మ్‌డ్(ఏఆర్), కమ్యూనికేషన్ విభాగాల్లో…
పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేసింది మద్రాస్ హైకోర్టు.. ప్రస్తుతం పోలీసు డిపార్ట్‌మెంట్‌లో 90 శాతం మంది అవినీతిపరులు ఉన్నారని.. 90 మంది అసమర్థులైన అధికారులతో పనిచేస్తున్నారని పేర్కొంది.. కనీసం కేసుల విచారణ సక్రమంగా నిర్వహించలేకపోతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.. పోలీసు శాఖలో కేవలం 10 శాతం మంది సిబ్బంది మాత్రమే నిజాయితీగా, సమర్థతతో ఉన్నారని.. అన్ని కేసుల్లోనూ విచారణ జరుపుతారని ఆ కొద్ది శాతం అధికారుల నుంచి ఆశించలేమని తేల్చి చెప్పింది.. అవినీతి అధికారులపై శాఖాపరమైన చర్యలు…
తెలంగాణ పోలీస్ శాఖను కరోనా మహమ్మారి కలవరపెడుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఎవరో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా సేవలు అందించిన పోలీసులు కరోనా బారిన పడుతుండటం బాధాకరమని చెప్పాలి. కరోనా థర్డ్ వేవ్‌లో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 మంది పోలీసులు కరోనా బారిన పడినట్లు అధికారులు చెప్తున్నారు. Read Also: విద్యార్థులకు అలర్ట్.. ఈనెల 30 వరకు అన్ని పరీక్షలు వాయిదా…