తెలుగులొగిళ్లలో భోగి వేడుకలు ప్రారంభం అయ్యాయి.. తెల్లవారుజాము నుంచి భోగి మంటలు వేస్తున్నారు ప్రజలు.. ఈ వేడుకల్లో పలు చోట్ల సినిమా స్టార్లు, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు భాగస్వాములు అవుతున్నారు.. మరోవైపు.. సంక్రాంతి పండుగకు కోడి కాలుదువ్వుతోంది.. సంక్రాంతి బరిలో కాలుదువ్వేందుకు పందెంకోళ్లు సై అంటున్నాయి. బరిలో నిలిచేందుకు కొన్ని నెలల పాటు ప్రత్యేక శిక్షణ పొంది, రాటుదేలిన కోళ్లు తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. మూడు రోజుల వేడుకలో ప్రత్యేకంగా నిలిచే కోడిపందేలను భారీగా…