వివిధ జిల్లాల పోలీసు శాఖల్లో పనిచేస్తున్న 35 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పిల్లలను కొత్తగూడెం జిల్లా ఎస్పీ అభినందించారు. ఇంటర్మీడియట్, ఎస్సెస్సీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బంది పిల్లలను ఎస్పి బి. రోహిత్ రాజు సన్మానించారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో మంచి ర్యాంకులు సాధించి తల్లిదండ్రులకు, మండలానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. పోలీస్ శాఖలో అహోరాత్రులు కష్టపడుతున్న తల్లిదండ్రుల కన్న కలలను విద్యార్థులు సాకారం చేయాలని రోహిత్ రాజు కోరారు.…