పోడు భూముల సమస్య అధికారపార్టీ ప్రజాప్రతినిధులకు తలపోటుగా మారింది. సీజన్ వస్తే చాలు.. అటవీ అధికారులతో లడాయి తప్పడం లేదు. ఆగ్రహావేశాలు.. దాడులు.. ఉద్రిక్తతలు రొటీన్ అయిపోయాయి. సమస్యను రాజకీయం చేయడానికి విపక్షాలు చూస్తుండటంతో మరింత టెన్షన్ పడుతున్నారట టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు. శాంతిభద్రతల సమస్యగా పోడు భూముల రగడ అటవీ అధికారులు.. గిరిజనులకు మధ్య పోడు భూములపై రగడ పాతదే. కానీ.. ఎప్పటికప్పుడు కొత్తగా తెరపైకి వస్తుంది. అడవినే నమ్ముకున్న తాము పోడు వ్యవసాయం చేసుకుంటే తప్పేంటని…