Pocharam Infocity: పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్ పక్కన అర్ధరాత్రి సమయంలో అనుమానాస్పద కదలికలు కనిపించాయి. టార్చ్‌లైట్లు, పూజా సామాగ్రి, గడ్డపారలతో కొందరు వ్యక్తులు ఏదో చేస్తున్నట్లు అనుమానం వచ్చింది. చూస్తే ఏదో రహస్య కార్యక్రమం జరుగుతున్నట్టే అనిపించింది. ఇదే విషయం స్థానికుల దృష్టికి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నప్పుడు.. తవ్విన ఓ పెద్ద గుంతతో పాటు.. పగలగొట్టిన కొబ్బరికాయలు, నిమ్మకాయలు కనిపించాయి. ఇది ఏదో పూజ తంతులా అనిపించింది. స్పాట్‌లో 8 మంది వ్యక్తులకు…