ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు స్కీమ్‌ల పేర్లను మారుస్తోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో స్కీమ్‌లకు పెట్టిన పేర్లను తొలగించి.. కొత్త పేర్లు పెడుతోంది. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా వైఎస్ఆర్ జగనన్న కాలనీల నిర్మాణాన్ని గత ప్రభుత్వం చేపట్టింది. అయితే.. ఈ కాలనీల పేర్లను మారుస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జగనన్న కాలనీల పేరను PMAY-NTR నగర్‌గా మార్చింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.